Maharashtra Cabinet Expansion: మహారాష్ట్రలో కేబినెట్‌ విస్తరణ.. బీజేపీకి పెద్ద పీట?

7 Jul, 2022 14:34 IST|Sakshi

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనంతరం.. శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, 45 మంది మంత్రులతో నూతన కేబినెట్‌ను షిండే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

అయితే, కొత్త కేబినెట్‌లో బీజేపీకి చెందిన వారు 25 మంది, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి 13 మంది మంత్రులు ఉంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక, స్వతంత్రులకు సైతం కేబినెట్‌లో స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది. కాగా, వీరిలో సీఎం షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ మినహా అందరూ కొత్తవారేనని సమాచారం. 

ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీ మధ్య ఓ ఒప్పందం కుదిరినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందం ప్రకారమే.. శివసేనతో ప్రతీ ముగ్గురు ఎమ్మెల్యేలకు, బీజేపీలో ప్రతీ నలుగురు ఎమ్మెల్యేలకు ఓ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై జూలై 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 

ఇది కూడా చదవండి: ఉద్ధవ్‌కు మరో ఎదురుదెబ్బ.. షిండే వర్గంలోకి 66 మంది శివసేన కార్పొరేటర్లు!

మరిన్ని వార్తలు