అజిత్ పవార్‌కు కరోనా పాజిటివ్

22 Oct, 2020 13:46 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి,ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎన్‌సీపీ నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోవిడ్-19 బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆయన గృహ నిర్బంధంలో ఉన్నట్టు సమాచారం. అటు పార్టీ కార్యాలయంలో  జరగాల్సిన  సమావేశానికి అజిత్ పవార్ హాజరు కావడంలేదని ఎన్‌సీపీ ప్రధాన కార్యదర్శి శివాజీరావ్ గార్జే బుధవారం ట్వీట్ చేశారు. అయితే దీనికి గల కారణాలను ఆయన పేర్కొనలేదు. మరోవైపు గురువారం జరగాల్సిన జనతా దర్బార్ రద్దు  చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతవారం కొంతమంది సీనియర్  నాయకులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన అజిత్ పవార్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బాధిత రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఏ ఒక్క రైతునూ కష్టాల్లో ఉండనీయం అంటూ వ్యాఖ్యానించారు. నష్టాన్ని అంచనా వేసే పనిని అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా వైరస్ కేసుల సంఖ్యలో మహారాష్ట్ర టాప్ లో ఉంది. కరోనా బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరణాల సంఖ్య 43 వేలను దాటింది. దేశంలో మొత్తం 77,06,946 కేసులు నమెదు కాగా మరణాలు 1,16,616 కు చేరాయి.

మరిన్ని వార్తలు