మన దేశానికి ఇద్దరు పితామహులు: డిప్యూటీ సీఎం భార్య కీలక వ్యాఖ్యలు

21 Dec, 2022 17:36 IST|Sakshi

నాగ్‌పూర్‌: మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ భార్య అమృతా ఫడ్నవిస్‌ ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర పితామహులుగా అభివర్ణించారు. మన దేశానికి ఇద్దరు పితామహులు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కాలానికి జాతి పితా మహాత్మా గాంధీ అయితే  నేటీ సరికొత్త భారతావనికి పితామహులు నరేంద్ర మోదీ అంటూ ప్రధానిపై పొగడ్తలు జల్లు కురిపించారు అమృతా ఫడ్నవిస్‌. 

ఈ మేరకు అమృతా ఫడ్నవిస్‌ నాగ్‌పూర్‌ రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె నరేంద్ర మోదీని రాష్ట్ర పితాగా వ్యవహరించారు. దీంతో మరి మహాత్మా గాంధీ ఏమవుతారంటూ విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆమె సమర్థించుకుంటూ ఆ కాలంలో మహాత్మా గాంధీ జాతి పితా, ప్రస్తుతం నరేంద్ర మోదీ అంటూ కవర్‌ చేశారు.

ఆమె ఇలా మోదీని పొగడ్తలతో ముంచెత్తడం మొదటి సారి కాదు. 2019లో ప్రధానికి పంపిన ట్విట్టర్‌ సందేశంలో కూడా మన దేశ పితామహుడు నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు. సమాజ అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేయడంలో మాకు స్ఫూర్తి మీరే అని పోస్ట్‌ చేశారు. ఆమె తరుచు ఇలా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ వార్తలో నిలుస్తుంటారు. అంతకు మునుపు ఉద్ధవ్‌ థాక్రేపై విరుచుపడి వార్తల్లో నిలిచారు. కాగా, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్‌ షిండే సీఎం కాగానే ఆమె భర్త దేవేంద్ర ఫడ్నవిస్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యిన సంగతి తెలిసిందే. 

(చదవండి: ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..)

మరిన్ని వార్తలు