అనిల్‌ దేశ్‌ముఖ్‌ పీఏ, వ్యక్తిగత కార్యదర్శి అరెస్ట్‌

26 Jun, 2021 11:07 IST|Sakshi

ఇద్దరిని 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ

సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సహాయకులిద్దరిని ఈడీ అరెస్ట్‌ చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో అనిల్‌ దేశ్‌ముఖ్‌ పీఏ, వ్యక్తిగత కార్యదర్శిని అరెస్ట్‌ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆయన నివాసంలో సోదాలు జరిపారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ హోంమంత్రిగా ఉన్న సమయంలో ముంబైలోని పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్‌ ఆరోపణలు మేరకు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. 

ఈ సందర్భంగా ఈడీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మనీ లాండరింగ్‌ చట్టం కింద అనిల్‌ దేశ్‌ముఖ్‌ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ పాండే, పీఏ కుందన్‌ షిండేలను అరెస్ట్‌ చేసి.. 9గంటల పాటు ప్రశ్నించాము. ముంబైలోని బల్లార్డ్‌ ఎస్టేట్‌లోని సెంట్రల్‌ ప్రోబ్‌ ఏజెన్సీ కార్యాలయంలో వీరిద్దరిని విచారిస్తున్నాము. కానీ వారు సహకరించడం లేదని’’ తెలిపారు.

చదవండి: అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌

మరిన్ని వార్తలు