హలో బదులు.. వందేమాతరం చెప్పండంటూ అధికారుల ఆదేశం.. ఎక్కడంటే!

26 Aug, 2022 17:23 IST|Sakshi

సాక్షి, ముంబై: విధుల్లో ఉన్న సమయంలో వచ్చే ఫోన్‌ కాల్స్‌కు హలో.. బదులుగా వందేమాతరం.. అని చెప్పాలంటూ మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆదేశాలు జారీ చేసింది. ‘అటవీ శాఖలోని అధికారులు, సిబ్బంది అందరూ విధుల్లో ఉన్న సమయంలో పౌరులు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను తీసుకునేటప్పుడు హలోకు బదులుగా వందేమాతరం అని అని చెప్పాలని కోరుతున్నాం’ అని అందులో ఉంది.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ ఫోన్‌ కాల్స్‌ రిసీవ్‌ చేసుకునేటప్పుడు హలో బదులుగా వందేమా తరం అని చెప్పాలని తమ శాఖ అధికారులను కోరినట్లు అటవీ శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సుధీర్‌ ముంగంటివార్‌ అంతకుముందు మీడియాతో అన్నారు.  
చదవండి: జార్ఖండ్ సీఎంకు షాక్.. శాసనసభ సభ్యత్వం రద్దు

మరిన్ని వార్తలు