ముంబై అగ్ని ప్రమాదం.. పోటాపోటీ ఆర్థిక సాయం

22 Jan, 2022 16:00 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. దురదృష్టకర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల పరిహారం ఇవ్వనుందని మంత్రి ఆదిత్యా ఠాక్రే తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఎక్స్‌గ్రేషియా ‍ప్రకటించిన ప్రధాని మోదీ
ముంబైలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ముంబైలోని టార్డియోలో భవనం అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ఒక్కొక్కరికీ రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాను మోదీ ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తామమని పీఎంఓ వెల్లడించింది. 

అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం: డిప్యూటీ సీఎం అజిత్ పవార్
టార్డియో ప్రాంతంలోని కమలా భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. మంత్రి ఆదిత్య ఠాక్రే, ముంబై నగర సంరక్షక మంత్రి అస్లాం షేక్ ఘటన స్థలాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 15 మందిపైగా గాయపడ్డారని బృహన్‌ముంబై కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.

చదవండి: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

మరిన్ని వార్తలు