తాత కోర్కెను తీర్చిన మనవళ్లు 

15 Jan, 2021 09:23 IST|Sakshi

సాక్షి ముంబై : పిల్లల కోరికలను తల్లిదండ్రులతోపాటు వారి నానమ్మలు, తాతయ్యలు తీర్చడం సాధారణంగా చూస్తుంటాం. కాని మహారాష్ట్రలో తాత కోరికను తీర్చి ఇద్దరు మనవళ్లు డాక్టర్‌ నందకుమార్‌ గోడ్‌గే, అడ్వకేట్‌ అవినాష్‌ గోడ్‌గేలు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకెక్కాడు. ఇప్పటివరకు సినీ హీరోలు, సెలబ్రీటీలు, రాజకీయ నాయకులతోపాటు వివాహవేడుకలలో వధూవరులు హెలికాప్టర్‌లో రావడం చూసి ఉంటాం. కాని తమ నానమ్మ చహాబాయి గోడ్‌గే,  తాత (అబ్బ) దేవరామ్‌ గోడ్‌గేల కోసం హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని పుణే నుంచి అహ్మద్‌నగర్‌ జిల్లాలోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. దేవరామ్‌ గోడ్‌గే 88వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ వినూత్న బహుమతిని వారికి  అందించారు.

పుణే నుంచి అహ్మదనగర్‌ జిల్లా సంగమ్‌నేర్‌ తాలూకాలోని చించోలి గురవ్‌ గ్రామం వరకు హెలికాప్టర్‌లో తీసుకెళ్లారు.అయితే దీనికి ముందు  ఆ గ్రామ సమీపంలోని ఓ మైదానాన్ని శుభ్రపరిచి హెచ్‌ ఆకారంలో రాశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామప్రజలు అందరు ఆసక్తిగా ఎదురుచూడసాగారు. అందరు చూస్తుండగానే మంగళవారం ఉదయం ఆకాశంలో హెలికాప్టర్‌ శబ్దం విని్పంచింది. అందరు ఒక్కసారిగా మైదానం వద్దకి పరుగులుతీశారు. ఇలా మునుపెన్నడు హెలికాప్టర్‌ను  ఇంత దగ్గరగా చూడని అనేక మంది గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. ఇంటికి సమీపంలో దిగిన హెలిక్యాప్టర్‌ ల్యాండింగ్‌ అయిన ప్రాంతం నుంచి ఇంటి వరకు వారిని బ్యాండు మేళాలతో ఇంటికి తీసుకెళ్లారు.
 
మరిచిపోలేని ఆనందాన్నిచ్చారు.. 
తన మనవళ్లు చివరి వయసులో జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చారంటూ దేవరామ్‌ గోడ్‌గే మీడియాకు తెలిపారు. ముఖ్యంగా డాక్టర్‌ నందకుమార్‌ పెళ్లి సమయంలో ఏనుగుపై ఊరేగింపు చేయాలని కోరడంతో ఆయన తాత ఎనుగును తీసుకొచ్చి ఊరేగించారు. దీంతో పలు మార్లు ఏదో సందర్భంగా అన్న తాను అన్న మాటలను గుర్తు ఉంచుకుని తనను నా భార్యను హెలిక్యాప్టర్‌లో తిప్పడమే గాక, తమ ఊరి వరకు తీసుకొని వచ్చారన్నారు.   

మరిన్ని వార్తలు