పోలీసులవి తీవ్రమైన తప్పిదాలు 

19 Mar, 2021 11:56 IST|Sakshi
ముంబై పోలీసు కమిషనర్‌ వేటుపై స్పందించిన మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ (ఫోటో కర్టెసీ: ఏబీపీ లైవ్‌)

అందుకే కమిషనర్‌ని బదిలీ చేశాం: హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ 

ముంబై: గత కొద్దిరోజులుగా నగరంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు తీవ్రమైన తప్పిదాలు చేశారని ప్రాథమిక నిర్ధరణకు వచ్చి.. వారిని బాధ్యులను బదిలీ చేశామని హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. అంతేకాకుండా ఎన్‌ఐఏ కేసులో సచిన్‌ వజేపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్ధేశంతో పలువురిపై బదిలీ వేటు వేశామని స్పష్టం చేశారు. దక్షిణముంబైలోని ముకేష్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు లభించడం, వ్యాపారవేత్త హిరానీ మరణించడం, పోలీస్‌ అధికారి సచిన్‌ వజే అరెస్టు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముంబై వార్తల్లో నిలిచింది.

అయితే పోలీసు సహచరుల తప్పిదాలకు కమిషనర్‌ పరం వీర్‌సింగ్‌ను బాధ్యుడిగా చేస్తూ బుధవారం హోంమంత్రి బదిలీ ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా ముంబై కమిషనర్‌గా హేమంత్‌ నాగ్రలే నియమితులయ్యారు. దీంతో హోం మంత్రి బదిలీపై ఓ ఛానెల్‌తో మాట్లాడారు. ఆయా కేసులపై ఏటీఎస్, ఎన్‌ఐఏ దర్యాప్తు నిష్పక్షపాతం గా జరుపుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే ఏటీఎస్, ఎన్‌ఐఏ విచారణలో కొన్ని విషయాలు బయటపడటమూ బదిలీలకు కారణమని హోం మంత్రి స్పష్టంచేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.  

చదవండి: ముంబై పోలీసు కమిషనర్‌పై బదిలీ వేటు

మరిన్ని వార్తలు