భార్యను కలిసేందుకు క్వారంటైన్‌ నుంచి పరార్‌.. పోలీసుల ట్విస్ట్‌

30 Apr, 2021 16:17 IST|Sakshi

ముంబై: కరోనా మొదటి దశ కంటే రెండో దశ తీవ్రంగా హడలెత్తిస్తోంది. దేశంలోని పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాలు చూస్తుంటే మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఆక్సిజన్ అందుబాటులో లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొంతమందైతే క్వారంటైన్‌ సెంటర్‌ లేదా ఇళ్లల్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తి భార్యను కలుసుకునేందుకు క్వారంటైన్‌ కేంద్రం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన షాబుల్లా ఖాన్‌ అనే వివిధ దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోవిడ్‌ టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

దీంతో అతన్నిబొరివలిలోని సాయినగర్‌ ప్రాంతంలోని క్వారంటైన్‌  కేంద్రానికి తరలించారు.  రెండు రోజుల్లో తాను దిగ్బంధం కేంద్రం నుంచి తప్పించుకుంటామని నిందితులు పోలీసులను సవాలు చేశారు. అన్న‌ట్టుగానే క్వారంటైన్‌ సెంటర్‌లో వైర్లు కత్తిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అప్ర‌మ‌త్త‌మైన కండివాలి పోలీసులు 24 గంట్లోనే నిందితుడిని ముంబైలోని ఒషివ‌ర ప్రాంతంలో అరెస్ట్ చేశారు. భార్య‌ను క‌లుసుకునేందుకే తాను పారిపోయాన‌ని నిందితుడు చెప్పుకొచ్చాడు. ఇక నిందితుడిపై ఫార్మ‌సీల నుంచి రెమిడిసివిర్ మందుల‌ను చోరీ చేశాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. 

చదవండి: కరోనా: బాధను పంచుకుంటే తప్పేంటి? సుప్రీం ఫైర్‌ 

మరిన్ని వార్తలు