ఆఫీసుకు రోజూ గుర్రంపై వెళ్తున్న ఉద్యోగి.. ఎందుకో తెలుసా?

28 Mar, 2022 19:54 IST|Sakshi

సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి వల్ల ఆంక్షల నేపథ్యంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో బైక్‌ను వినియోగించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ ఫార్మసీ కాలేజీలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ప్రతిరోజూ గుర్రం మీద తన కార్యాలయానికి వెళ్తున్నాడు. ఔరంగాబాద్‌లో డీజిల్‌ ధర రూ.100కు కొన్ని పైసలు తక్కువగా ఉండగా, పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.115 దాటింది. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌ ధర 50 పైసలు, లీటర్‌ డీజిల్‌ ధర 55 పైసలు పెరిగింది. ఈ నేపథ్యంలో షేక్‌ యూసుఫ్‌ తన బైక్‌ను పక్కనపెట్టి తన ఇంటి నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న తన కార్యాలయానికి గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తున్నాడు.

అంతకుముందు లాక్‌డౌన్‌ సమయంలో ప్రాక్టీస్‌ చేసినట్లు చెప్పాడు. ‘లాక్‌డౌన్‌ తర్వాత గ్యారేజీలు చాలాకాలం పాటు మూసివేసి ఉన్నాయి. దీంతో బైక్‌ను మెయింటెన్‌ చేయడం సమస్యగా మారింది. కాబట్టి నేను నా వాహనాన్ని పక్కనపెట్టి కతియావాడి గుర్రాన్ని కొనాలని నిర్ణయించుకున్నాను. రోజూ 30 కి.మీ. ప్రయాణం చేస్తా. పలు కుటుంబ ఫంక్షన్లకు కూడా గుర్రం మీదే వెళ్తా. అంతేకాదు గుర్రం మీద ప్రయాణ చేయడం బైక్‌ మీద వెళ్లడం కంటే చాలా చవక’ అని యూసుఫ్‌ చెప్పుకొచ్చాడు.   
చదవండి: ప్రతి ఆదివారం ఈ రోడ్లకు సెలవు.. నేటి నుంచే అమలు! 

మరిన్ని వార్తలు