Nagpur Fake Gang Rape Case: ‘నా బాయ్‌ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవాలనీ'..!

14 Dec, 2021 14:27 IST|Sakshi

నాగ్‌ఫూర్‌: బాయ్‌ ఫ్రెండ్‌ను పెళ్లాడటానికి 19 యేళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురయ్యానంటూ కట్టుకథ అల్లి పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేసినట్లు మంగళవారం నాగ్‌పూర్‌ అధికారులు మీడియాకు తెలిపారు. సదరు యువతి సోమవారం ఉదయం 11 గంటలకు కలమ్నా పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయడంతో నాగ్‌పూర్‌ పోలీస్‌ కమీషనర్‌ అమితేష్‌ కుమార్‌తో సహా, ఇతర సీనియర్‌ అధికారులతో కూడిన సుమారు వెయ్యి మంది భద్రతా సిబ్బందిఈ కేసును విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా సిటీలోని 250కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ఇదంతా కట్టుకథని పోలీసధికారులు ధృవీకరించారు. ఐతే ఇదంతా ఎందుకు చేసిందో ఖచ్చితమైన కారణం తెలియచేయలేదని పోలీసులు తెలిపారు.

కాగా ఆమె ఇచ్చిన పిర్యాదులో నాగ్‌పూర్‌ చిఖ్కలిలో నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్‌ రేప్‌ చేసినట్లు తెల్పింది. ఉదయం మ్యూజిక్‌ క్లాస్‌కు వెళ్తుండగా మార్గం మధ్యలో వైట్‌ కలర్‌ వ్యాన్‌లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు డైరెక్షన్లడిగే నెపంతో మాట్లాడుతూ, వ్యాన్‌లోకి బలవంతంగా లాగి, ముఖాన్ని గుడ్డతో కప్పారని తెల్పింది. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పిర్యాదులో పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌ రిజిస్ట్రర్‌ చేసిన తర్వాత పోలీస్‌ కమీషనర్‌ అమితేష్‌ కుమార్‌, అడీషనల్‌ సీపీ సునీల్‌ ఫులారీ, ఇతర సీనియర్‌ అధికారులు సీతాబుల్దీ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. కమీషనర్‌ కుమార్‌ దాదాపుగా వెయ్యి మంది పోలీసులతో 40 స్పెషల్‌ టీమ్‌లను ఏర్పాటుచేసి, సిటీలోని వ్యాన్‌లను, సీసీటీవీలను పరిశీలిండానికి, యువతి స్నేహితులను ప్రశ్నించడానికి హుటాహుటీన పంపారు. యువతిని మెడికల్‌ పరీక్షల నిమిత్తం మేయో హాస్పిటల్‌కు తరలించారు.  ఈ ఉదంతంపై పోలీసధికారులు ప్రశ్నించగా తన బాయ్‌ఫ్రెండ్‌ను వివాహమడటానికి చేశానని చెప్పినట్లు తెల్పింది.

ఆరు గంటలపాటు సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, దాదాపు 50 మందిని విచారించిన తర్వాత అనుమానం వచ్చిన పోలీసులు యువతిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన బాయ్‌ ఫ్రెండ్‌ను వివాహం చేసుకోవడానికే ఈ నాటకమంతాడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది.

చదవండి: జంక్‌ సామ్రాజ్యం ‘సోటిగంజ్‌’.. చోర్‌ మాల్‌తో 30 ఏళ్ల దందా.. కోట్లకు కోట్లు వెనకేశారు

మరిన్ని వార్తలు