Viral Video: మండుటెండలో కోతి దాహం తీర్చిన పోలీస్‌.. ‘హ్యాట్సాఫ్‌ సార్‌’

5 Apr, 2022 15:25 IST|Sakshi

ముంబై: ఎవరైనా ఆపదలో ఉంటే మనం చేయగలిగే సాయం చేయాలంటారు పెద్దలు. అప్పుడే మనిషిలోని మంచితనం బయటపడుతుంది. కానీ ఈ మధ్య కాలంలో మనిషి నుంచి మానవత్వం మాయమైపోతుంది. బయట వరకు కాదు కదా సొంతవారికి ఆపదొచ్చిందని తెలిసినా పట్టించుకోవడం లేదు. నాకేం సంబంధం అంటూ చేతులు దులుపేసుకుంటున్నారు.  ఇలాంటి సందర్భంలో ఓ వ్యక్తి వానరంపై చూపిన ప్రేమ ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. 

ఈ ఏడాది ఎండలు మామూలుగా లేవు. మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ఎండ ధాటికి మనుషులలే జంతువులు కూడా తాళలేకపోతున్నాయి. మంచినీటి కోసం జంతువులు అడవి నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఎండలను తట్టుకోలేని కోతి మంచినీటి కోసం విలవిల్లాడుతుండగా.. ఓ పోలీస్ స్వయంగా దానికి మంచినీటిని తాగించాడు. 
చదవండి: చేతిలో పసికందుతో సాహసం.. కానిస్టేబుల్‌కు ప్రమోషన్‌

మహారాష్ట్రలో ఓ కానిస్టేబుల్‌ మండుటెండలో రోడ్డుపై దాహంతో ఉన్న కోతికి బాటిల్‌ ద్వారా నీటిని తాగించి దాని దాహార్తిని తీర్చాడు. తీవ్ర దాహంతో ఉన్న వానరం ఏకంగా బాటిల్ మంచినీటిని గుటగుటా తాగేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎస్‌ అధికారి సుశాంత్‌ నందా ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇది తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వానరం దాహార్తి తీర్చిన ట్రాఫిక్ పోలీస్‌ను హ్యాట్సాఫ్‌ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు