Uddhav Thackeray: నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించండి..

29 Jun, 2022 19:19 IST|Sakshi

సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్‌ బుధవారం సాయంత్రం భేటీ అయ్యింది. రేపటి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చించారు. కేబినెట్‌ మీటింగ్‌లో ఉద్వేగభరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. కేబినెట్‌ భేటీలో మంత్రులకు సీఎం ఉద్దవ్‌ ధన్యవాదాలు తెలిపారు. తన వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించాలని కోరారు.

నా వాళ్లే మోసం చేశారు
ఈ రెండున్నరేళ్లుగా తనకు అండగా నిలబడిన, సహకరించిన వాళ్లందరికి కృతజ్ఞతలు తెలిపారు. తన వాళ్లే తనను మోసం చేశారని, ఈ పరిస్థితికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. సుప్రీంకోర్టులో తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. భేటీ అనంతరం మీడియాకు నమస్కరించి ఉద్దవ్‌ వెళ్లిపోయారు.
చదవండి: ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు?

కాగా మహారాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో రెండు నగరాల పేర్లను ఉద్దవ్‌ సర్కార్‌ మార్చింది. ఔరంగాబాద్‌ పేరును శంభాజీనగర్‌గా.. ఉస్మానాబాద్‌ పేరు ధారా శివ్‌గా మార్చింది. నవీముంబై ఎయిర్‌పోర్టు పేరును డీబీ పాటిల్‌ ఎయిర్‌పోర్టుగా మారుస్తూ ఉద్ధవ్‌ ఠాక్రే కేబినేట్‌ ఆమోదం తెలిపింది.

మరిన్ని వార్తలు