Maharashtra Political Crisis: ఇంతకు ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు? 

29 Jun, 2022 15:48 IST|Sakshi

సాక్షి, ముంబై: రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదరడంతో ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. దీంతో ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో అంతుచిక్కడం లేదు. ఎవరికి వారే బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప కచ్చితమైన ఎమ్మెల్యేల సంఖ్య ఎవరూ బయటపెట్టడం లేదు. శివసేనలో మొత్తం 55 మంది ఎమ్మెల్యేలున్నారు. 

అందులో 15–20 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం చెబుతోంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం తమకే ఉందని ఉద్ధవ్‌ మద్దతుదార్లు ప్రకటనలు చేస్తున్నారు. కానీ మా వెంట 40 మంది శివసేన ఎమ్మెల్యేలున్నారని, ఇతరులతో కలిపి మొత్తం 50–55 మంది మద్దతుదారులున్నారని ఏక్‌నాథ్‌ షిందే వర్గం ప్రకటిస్తోంది. దీంతో ఏ వర్గంలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారనే దానిపై ఇటు ప్రజల్లో అటు మహావికాస్‌ ఆఘాడినేతల్లో అయోమయ పరిస్ధితి నెలకొంది.  
చదవండి: మహారాష్ట్ర గవర్నర్‌ రఫెల్‌ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్‌ రౌత్‌ సెటైర్లు

రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్ధానాలు 288 ఉండగా అందులో శివసేనకు 55 ఉన్నాయి. అందులో ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి 16, ఏక్‌నాథ్‌ షిందే వర్గానికి 39 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా మొత్తం 36 జిల్లాల్లో ఏక్‌నాథ్‌ షిందేకు 18 జిల్లాల్లో 39 మంది ఎమ్మెల్యేలున్నారు. అదేవిధంగా ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి తొమ్మిది జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే ఉద్ధవ్‌కు 25 శాతం జిల్లాల్లో, షిందే వర్గానికి 50 శాతం జిల్లాల్లో ఎమ్మెల్యేలున్నారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు