Maharashtra Terror Scare: రాయ్‌గఢ్‌లో టెర్రర్‌ బోట్‌ కలకలం.. భారత్‌లో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్‌?

18 Aug, 2022 15:36 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. రాయ్‌గఢ్‌లోని హరిహరేశ్వర్‌ బీచ్‌లో టెర్రర్‌ బోట్‌ కలకలం సృష్టిస్తోంది. ముంబైకి 190 కి.మీ దూరంలోనున్న బీచ్‌ వద్ద స్థానికులు బోటును గుర్తించారు. అందులో ఎలాంటి సిబ్బంది లేకపోవడంతో భద్రతా ఏజన్సీలను అప్రమత్తం చేశారు. బోట్లలో మూడు ఏకే 47, బుల్లెట్లు, అమ్మోనియం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముంబై తరహా దాడులకు కుట్ర చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయ్‌గఢ్‌ వ్యాప్తంగా పోలీసులు భద్రతకు కట్టుదిట్టం చేశారు.హై అలర్ట్‌ ప్రకటించారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ దళం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. పడవ ఎక్కడి నుంచి వచ్చింది? అందులోని ఆయుధాలు ఎవరు పంపారు? పడవలో ఎవరైనా వచ్చారా?. నే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా అనుమానస్పద బోటు ఘటనపై ప్రత్యేక విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు రాయ్‌గఢ్ ఎమ్మెల్యే అదితి తట్కరే తెలిపారు. గణేష్‌ చవితి సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆమె అన్నారు.
చదవండి: కేంద్రం సీరియస్‌.. యూట్యూబ్‌ ఛానల్స్‌పై నిషేధం

మరిన్ని వార్తలు