రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షల మంది మృతి.. ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్‌

30 Aug, 2022 07:25 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: బలవన్మరణాల సంఖ్యపరంగా దేశవ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో తాజా నివేదికలో పలు విషయాలను ప్రస్తావించింది. 2021 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వృత్తి సమస్యలు, ఒంటరితనం, హింస, కుటుంబ, మానసిక సమస్యలు, మద్యానికి బానిసకావడం, ఆర్థికంగా కుంగుబాటు, అనారోగ్యం ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని నేర గణాంకాల బ్యూరో తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 22,207 మంది, కర్ణాటకలో 13,056 మంది సూసైడ్‌ చేసుకున్నారు. దేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో సగానికిపైగా సూసైడ్‌లు మహారాష్ట్ర తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటకలోనే జరిగాయి.  53 నగరాల్లో మొత్తంగా 25వేలకుపైగా సూసైడ్‌ చేసుకున్నారు. 

1.73 లక్షల యాక్సిడెంట్‌ మరణాలు
గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన 4.22 లక్షల ట్రాఫిక్‌ ప్రమాదాల్లో 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ నేర గణాంకాల బ్యూరో తెలిపింది. యూపీలో ఎక్కువ మరణాలు సంభవించాయి. 2020తో పోలిస్తే 2021లో మరణాలు 18.8 శాతం పెరగడం ఆందోళనకరం.
చదవండి: గణపతి మండపానికి రూ. 316 కోట్ల బీమా 

మరిన్ని వార్తలు