పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలు, జెండాలు.. మహారాష్ట్ర ఏకీకరణ సమితి దాడి

28 May, 2022 10:25 IST|Sakshi

బెళగావి: కర్ణాటక బెళగావిలో కన్నడ పాటలు పెట్టినందుకు వధూవరులపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలైనట్లు సమాచారం. 

మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. దమానే గ్రామంలో రేష్మ-సాయిబన్వర్‌ల వివాహం జరిగింది. పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలను ప్రదర్శించడంతో పాటు కన్నడ జెండాలతో డ్యాన్సులు చేశారు కొందరు. 

దీంతో చన్నమ్మనగర్‌కు చెందిన ఎంఈఎస్‌ కార్యకర్తలు కొందరు ఊరేగింపుపై దాడికి పాల్పడ్డారు. ఐదుగురు యువకులను తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ వాళ్లను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి.. పది మంది ఎంఈఎస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు