‘కరోనా నివారణకు లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం’‌

19 Mar, 2021 18:51 IST|Sakshi

ముంబాయి: మహరాష్ట్రలో కరోనా తీవ్రరూపం దాల్చింది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్‌ ఠాక్రె కరోనా వ్యాప్తి అరికట్టడానికి లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గంగా భావిస్తున్నారు.. మహారాష్ట్ర లో ప్రతిరోజు గరిష్టంగా 25,833 కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌ వ్యాప్తి సెకండ్‌వేవ్‌లోకి ప్రవేశించిందని, దీన్ని అరికట్టాలంటే ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని అన్నారు. మాస్క్‌ లు ధరించడం, సామాజికదూరం పాటించడం, సానిటైజేష్‌ను తప్పకుండా అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. 

గతంలో కోవిడ్‌‌ విజృంబించినప్పుడు ప్రజలందరు సహకరించారని, ఇప్పుడు కూడా అలాగే సహకరించి ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలని అన్నారు. ప్రజలందరు.. విధిగా వ్యాక్సినేషన్‌ను చేసుకొవాలని సీఎం ఉద్దవ్‌ఠాక్రె కోరారు. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్‌ల కోరత లేకుండా, ప్రజలందరికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.   

చదవండి: వామ్మో..ఈ దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌!

మరిన్ని వార్తలు