దేశవ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు

11 Mar, 2021 15:55 IST|Sakshi

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటేత్తారు. తినేత్రుడిని స్మరిస్తూ..భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కొన్ని శైవక్షేత్రాలు భక్తులతో క్రిక్కిరిసిపోగా.. కొన్ని చోట్ల కరోనా భయంతో వెలవెలబోయాయి. దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడకలు ఎలా జరిగాయంటే..

ఉత్తరప్రదేశ్‌
రాష్ట్రంలోని కాశీ విశ్వనాధుడిని దర్శించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు.

ఉత్తరఖాండ్‌
ప్రస్తుతం రాష్ట్రంలో మహాకుంభమేళా జరుగుతోంది. దాంతో పాటు నేడు మహాశివరాత్రి పర్వదినం కూడా కలిసిరావడంతో భక్తులు, సాధువులు పెద్ద సంఖ్యలో హరిద్వార్‌ గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు.

మధ్యప్రదేశ్‌
రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహారాష్ట్ర
రాష్ట్రంలోని త్రయంభకేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీ ఎత్తున హాజరయి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి కోవిడ్‌ కారణంగా ఆంక్షలు విధించడంతో త్రయంభకేశ్వర ఆలయం వెలవెలబోతుంది. 

ఒడిశాలో
రాష్ట్రంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భువనేశ్వర్‌లోని లింగరాజ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

జమ్మూకశ్మీర్‌
మహాశివరాత్రి సందర్భంగా ప్రజలు శ్రీనగర్‌లోని శంకరాచార్య ఆలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నేపాల్‌
నేపాల్‌లోని పశుపతి నాథ్‌ ఆలయం ప్రముఖ శైవక్షేత్రం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీ ఎత్తున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి కరోనా కారణంగా ఆలయం వెలవెలబోయింది.

పంజాబ్‌
శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు ఆలయాలకు భారీ ఎత్తున పోటేత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఫోటో కర్టెసీ: ఏఎన్‌ఐ
 

మరిన్ని వార్తలు