వీడియో: నెహ్రూ మునిమనవడి వెంట గాంధీ మునిమనవడు.. వైరల్‌

18 Nov, 2022 13:18 IST|Sakshi

ముంబై: కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతంలోని ప్రముఖులు ఈ జోడో యాత్రలో పాల్గొని ఆకర్షణగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అదీగాక రాహుల్‌ ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా రాహుల్‌ మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని షెగావ్‌కి చేరుకోగానే మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్‌ గాంధీ పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ షెగావ్‌లోని భారత్‌ జోడో యాత్రలో తుషార్‌ గాంధీ పాల్గొనడం అనేది ఒక చారిత్రత్మకమని ప్రశంసించింది. రచయిత, కార్యకర్త అయిన తుషార్‌ గాంధీ రాహుల్‌ గాంధీతో ఈ యాత్రలో హుషార్‌గా పాల్గొన్నారు. జవహర్‌లాల్‌​ నెహ్రూ, మహాత్మాగాంధీల ముని వనవళ్లు ఈ యాత్రలో కలిసి నడవడం అత్యద్భుతమని, ఇద్దరు దివగంత నాయకుల వారసత్వాన్ని కొనసాగించే మహోన్నత వ్యక్తులగా అభివర్ణించింది. ఈ యాత్రలో తుషార్‌ గాంధీతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ముకుల్‌ వాస్నిక్‌, దీపేందర్‌ హుడా, మిలిందా దేవదా, మాణిక్‌ ఠాక్రే, ముంబై కాంగ్రెస్‌ అధ్యక్షుడు భాయ్‌ జగ్తాప్‌, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్‌ నానా పటోలే తదితరలు రాహుల్‌ వెంట నడిచారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఈ మేరకు తుషార్‌ గాంధీ ట్విట్టర్‌లో ...షేగావ్‌ తన జన్మస్థం అని, జనవరి 17, 1960న తన అమ్మ వయా నాగ్‌పూర్‌ హౌరా మెయిల్‌లో ప్రయాణిస్తున్నప్పుడూ షేగావ్‌లో ఆగిపోయిందని అప్పుడే తాను పుట్టానని చెప్పుకొచ్చారు. ఈ సాయంత్రం షెగావ్‌లో జరిగే బహిరంగ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఈ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో చివరి దశలో ఉంది. నవంబర్ 20కల్లా మధ్యప్రదేశ్‌లో ప్రవేశించనుంది.

తుషార్‌గాంధీ అరుణ్‌మణిలాల్‌ గాంధీ తనయుడు. అరుణ్‌ మణిలాల్‌ గాంధీ.. గాంధీ-కస్తూరబా గాంధీల రెండో సంతానం అయిన మణిలాల్‌ మోహన్‌ దాస్‌ తనయుడు. 

(చదవండి: రాహుల్‌ పాదయాత్రలో మెరిసిన హీరోయిన్‌.. ఫోటోలు, వీడియోలు వైరల్‌)

మరిన్ని వార్తలు