బాహుబలి 2: ప్రభాస్‌ స్టైల్లో ఏనుగెక్కిన ముసలాయన.. తగ్గేదే లే.. వైరల్‌ వీడియో

1 Apr, 2022 18:58 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన బాహుబలి చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. రెండు పార్టులుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫిస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టింది. ప్రభాస్‌ కెరీర్‌లోనే ది బెస్ట్‌ మూవీగా నిలిచిపోయింది. ప్రభాస్‌ నటన, పాటలు, యాక్షన్‌ సన్నివేశాలు ఒక్కటేంటి సినిమాలోని అన్నీ అంశాలు అభిమానులు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సినిమా వచ్చి ఆరేళ్లు పూర్తైనా ఇప్పటికీ బాహుబలికి ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.

కాగా బాహుబాలి సెకండ్‌ పార్ట్‌లో ప్రభాస్‌ తొండం మీద కాలు పెట్టి ఏనుగు మీదకు ఎక్కి కూర్చూనే సీన్‌ ఒకటి ఉంటుంది. దాదాపు ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమాకు ఈ సన్నివేశం హైలెట్‌గా నిలిచింది. తాజాగా అచ్చం బాహుబలి స్టైల్లో ఓ వ్యక్తి ఏనుగు మీదకు ఎక్కాడు. ఐపీఎస్‌ అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్‌లో పోస్టు చేశారు. 20 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఏనుగులపై స్వారీ చేసే వ్యక్తి దాని ముందు నిల్చొని ఉంటాడు. వెంటనే ఎలాంటి సాయం లేకుండా తొండంపై కాలు పెట్టి ఏనుగు ఎక్కి కూర్చుంటాడు.
చదవండి: Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు..

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌చేస్తోంది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు బాహుబలి సినిమాలోని సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చిదంటూ కామెంట్‌ చేస్తున్నారు. బాహుబలి 2లో ప్రభాస్‌ ఇలాగే చేశాడని, ప్రభాస్‌ ఒకవేళ వృద్ధుడు అయిన తర్వాత ఇలాగే చేసేవాడని, బాహుబలి పార్ట్‌ 3లా ఉందంటూ కామెంట్‌ చేస్తున్నారు.
చదవండి: మిస్‌ యూనివర్స్‌కు బాడీ షేమింగ్‌.. అసలు విషయం చెప్పిన హర్నాజ్‌

మరిన్ని వార్తలు