కరోనా ఫ్రీ ఇండియా కోసం కలిసి నడుద్దాం

25 May, 2021 18:14 IST|Sakshi

హైదరాబాద్‌: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య భాగ పెరగింది. కొద్దీ రోజుల క్రితం వరకు ఎక్కువ సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పడు కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఈ కరోనాను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరుకుంటారు. కానీ, బయటకి వెళ్తే తమకు ఎక్కడ సోకుతుందో అని భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో కోవిడ్-19 రోగులకు సకాలంలో ఆస్పత్రి పడకలు, ఆక్సిజన్ సౌకర్యాలు, వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే చాలా వరకు మరణాలు రేటు తగ్గించవచ్చు.

సరైన సమయానికి హాస్పిటల్ పడకలు, ఆక్సిజన్ లభించక చాలా మంది మరణిస్తున్నారు. ఒకవేల ఇవన్నీ అందుబాటులో ఉంటే వారిలో ఎక్కువ శాతం మందిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. మళ్లీ సాధారణ భారతదేశం చూడటానికి కోవిడ్ -19 ఫ్రీ ఇండియాగా మార్చడానికి ఒక వెబ్‌సైట్(www.normalindia.com) అందుబాటులో ఉంది. ఈ వెబ్‌సైట్ ద్వారా హాస్పిటల్ పడకలు, ఆక్సిజన్ సౌకర్యాలు, వ్యాక్సిన్ వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. దీనిలో మీ ప్రాంత పిన్ కోడ్ లేదా రాష్ట్రం, జిల్లా పేరు ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే, మీకు తెలిసిన సమాచారాన్ని పంచుకోవచ్చు. మీరు ఈ సమాచారం పంచుకోవడం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు. 

చదవండి:
ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల‌ను అప్‌డేట్ చేసుకోండి

మరిన్ని వార్తలు