మానవత్వం చూపిన కలెక్టర్‌

4 Jul, 2021 08:43 IST|Sakshi
కలెక్టర్‌ వాహనంలో కూర్చున్న బాధితులు

మల్కన్‌గిరి: బైక్‌ ప్రమాదంలో గాయపడిన తండ్రీకుతుళ్లను కాపాడి మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ కన్వర్‌ విశాల్‌ సింగ్‌ మానవత్వం ప్రదర్శించారు.  వివరాలిలా ఉన్నాయి. మోంటు పర్యటనకు వెళ్లిన కలెక్టర్‌ శుక్రవారం సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో జోరుగా వర్షం కురిసింది. అదే సమయంలో బైక్‌పై వస్తున్న ఓ తండ్రీకూతుళ్లు స్కిడ్‌ అయి రోడ్డుపై పడి గాయాల పాలయ్యారు.  ఈ ప్రమాదాన్ని గమనించి కలెక్టర్‌ వాహనం అపి విషయం తెలుసుకుని మంచినీరు తాగించారు. అనంతరం తన వాహనంలో బాధితులను కొంతదూరం తీసుకువచ్చి పీసీఆర్‌ వాహనంలో ఎక్కించి మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి చికిత్స చేయాలని ఆదేశించారు. ఈ విషయం తెలిసిన జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు