ఇది వేధించడం గాక ఇంకేంటి?.. మేనల్లుడి భార్యను అడ్డుకోవడంపై మమతా ఫైర్‌

6 Jun, 2023 12:59 IST|Sakshi

బొగ్గు కేసులో విచారణలో ఉ‍న్న తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందని అభిషేక్‌ బెనర్జీ భార్య రుజీరాను అధికారులు కోల్‌కతా విమానాశ్రయంలో అడ్డుకోవడాన్ని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఆమె తన ప్రయాణ ప్రణాళికలు గురించి ఈడికి తెలియజేసినప్పటకీ అడుకున్నారని సీరియస్‌ అయ్యారు. ఇది వేధించడం గాక ఇంకేమిటి అని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం అని అన్నారు. అభిషేక్‌ బెనర్జీ అత్తగారికి అనారోగ్యంగా ఉంది. అందువల్ల అతడి భార్య తన తల్లిని కలిసేందుకు వెళ్లింది. ఆమె కోల్‌కతాను విడిచి వెళ్లాలంటే ముందుగానే ఈడీకి తెలియజేయాలని సుపప్రీం కోర్టు పేర్కొంది.

ఆ ప్రకారమే ఆమె ఈడీకి సమాచారం అందించినప్పటికి అలా ఎలా చేసింది ఈడీ అని ప్రశ్నించారు. ఆమెనున విమానాశ్రయంలో అడ్డుకోవడం పిలిపించడం ఇవన్నీ వేధింపులు గాక మరొకటి కాదని అన్నారు మమతా. ఇదిలా ఉండగా, అభిషేక్‌ బెనర్జీ ఈ విషయమై మాట్లాడుతూ..తన భార్య ప్రయాణం ప్రణాళిక గురించి ముందుగానే ఈడీకి తెలియజేశామని అన్నారు. దుర్మార్గపు ఉద్దేశాలు ఉంటే వారికి తెలియజేయాల్సిన అవసరం ఉండదు కదా అని అన​ఆనరు. తాను చేస్తున్న తృణమూలే నబో జోవర్‌ ప్రచారానికి వచ్చిన ప్రతిస్పందనతో బీజేపీ ఉలిక్కిపడుతోందన్నారు.

ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీ దానిని అడ్డుకోవాలని చూస్తుంది. మమ్మల్ని వేధించడానికి మార్గాలు వెతుకుతోందని ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ..నా భార్యను, నా పిల్లలను లేదా నన్ను ఈడీ అరెస్టు చేసినా తాను తల వంచేదే లేదని తేల్చి చెప్పారు. ప్రధాని కుర్చిపై ఉన్న గౌరవంతో ఆయనకు ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నానని అన్నారు.

నావయసు ఆయన రాజకీయ అనుభవం అంత కాకపోవచ్చు..కానీ మీరు నాతో రాజకీయంగా ప్రజాకోర్టులో పోరాడలేకపోతున్నారని విమర్శించారు అభిషేక్‌ బెనర్జీ. అభిషేక్‌ ఆరోపణలపై బీజేపీ స్పందిస్తూ..ఈడీ స్వతంత్ర సంస్థ అని, బీజేపీకి ఈడీ లేదా సీబీఐతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని, ఏవైన ఫిర్యాదులు ఉంటే ఎప్పుడైన వారు కోర్టుని ఆశ్రయించవచ్చు అని బీజేపీ నాయకుడు రాహుల్‌ సిన్హా అన్నారు. 

(చదవండి: ఆ దుర్ఘటన తర్వాత టికెట్లు రద్దయ్యాయి!..వివరణ ఇచ్చిన రైల్వేస్‌)

మరిన్ని వార్తలు