సోనియా గాంధీతో సమావేశమైన మమతా బెనర్జీ

28 Jul, 2021 18:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. బుధవారం 10 జనపథ్‌కు వెళ్లి సోనియాతో ఆమె సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ కానున్నారు. కాగా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్న మమతా ల్లీలో వరుసగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో భేటీ అవుతున్నారు. మిషన్ 2024లో భాగంగా విపక్ష నేతలను మమత కలుస్తున్నారు.

కాగా విపక్ష కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారనేది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుందని, ఇది చెప్పేందుకు తానేమీ రాజకీయ జ్యోతిష్కురాలిని కాదని మీడియాతో మమత పేర్కొన్నారు. సోనియా గాంధీతో సమావేశం చాలా సానుకూలమైందని, అనేక విషయాలపై చర్చించినట్లు తెలిపారు. రాజకీయ పరిస్థితులు, కోవిడ్‌, పెగసాస్ స్పైవేర్ స్నూపింగ్ వివాదం గురించి కూడా చర్చించినట్లు మమతా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్ష పార్టీలు కలిసి రావాలని సోనియాతో భేటీ అనంతరం మమతా పిలుపునిచ్చారు. కాగా నిన్న మమతా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బాటు కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్, ఆనంద్ శర్మ, అభిషేక్ మను షింగ్వి తదితరులను కలుసుకున్న విషయం తెలిసిందే

మరిన్ని వార్తలు