బీజేపీ చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బందిపడాలా..?

11 Jun, 2022 14:42 IST|Sakshi

మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నుపూర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చేసిన వ్యాఖ్యలు దేశంలో పెను దుమారానికి దారితీశాయి. వారి వ్యాఖ‍్యలకు నిరసనగా ముస్లిం సంఘాలు శుక్రవారం మసీద్‌ల వద్ద ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నిరసనల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. 

ఇక, పశ్చిమ బెంగాల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బెంగాల్‌లోని హౌరా పట్టణంలో శ‌నివారం పోలీసులు, నిర‌స‌న‌కారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు తలెత్త‌డంపై బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీపై నిప్పులు చెరిగారు. మమతా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ చేసిన త‌ప్పుల‌కు ప్ర‌జ‌లు ఎందుకు ఇబ్బందులు ఎదుర్కోవాలి. హౌరా ఘ‌ర్ష‌ణ‌లకు దారి తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ హింస వెనుక కొన్ని రాజ‌కీయ పార్టీల ప్ర‌మేయం ఉంది. హింసాత్మ‌క నిర‌స‌న‌ల‌తో గ‌త రెండు రోజులుగా హౌరాలో సాధార‌ణ జ‌న‌జీవన స్తంభించిపోయింది. కొన్ని రాజ‌కీయ పార్టీలు వెనుక ఉండి అల్ల‌ర్ల‌ను ప్రేరేపిస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. 

ఇదిలా ఉండగా.. అల్ల‌ర్ల‌ కారణంగా ఉలుబెరియ స‌బ్‌డివిజ‌న్‌లో విధించిన 144 సెక్ష‌న్‌ను జూన్ 15 వ‌ర‌కూ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, హౌరాలో శుక్రవారం చోటుచేసుకున్న హింసలో పోలీసులు 70 మందిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. మరోవైపు.. బెంగాల్‌లో అల్ల‌ర్ల‌ను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర బ‌ల‌గాల‌ను పంపాల‌ని బీజేపీ ఎంపీ, రాష్ట్ర బీజేపీ ఉపాధ్య‌క్షుడు సౌమిత్ర ఖాన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు.ఇక, నిన్న జరిగిన హింసాత్మక ఘటనల్లో నిరసరకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పంటించారు.

ఇది కూడాచదవండి: హింసాత్మకంగా మారిన నిరసనలు.. కర్ఫ్యూ విధింపు

మరిన్ని వార్తలు