పోలీసు అధికారిపై అనుచిత వ్యాఖ్యలు.. సీఎం మమతా ఫైర్‌

20 Feb, 2024 19:00 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ పోలీసు ఉన్నతాధికారిపై బీజేపీ నిరసనకారుడు కార్యకర్త చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత సువేందు అధికారి సందేశ్‌ఖాలీలో పర్యటించటం కోసం బీజేపీ కార్యకర్తలతో బయలుదేరారు. దీంతో  అక్కడ నిషేదాజ్ఞలు ఉన్నాయని పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసుల్లో.. ఉన్నతాధికారిగా ఒక సిక్కు అధికారి ఉన్నాడు. దీంతో బీజేపీ కార్యకర్తల్లో ఒకరు ఆయన్ను ‘ఖలిస్థానీ’ అంటూ అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ  వీడియోపై పశ్చిమ బెంగాల్‌  సీఎం మమతా బెనర్జీ ఎక్స్ (ట్విటర్‌) వేదికగా మండిపడ్డారు. ‘ఈ రోజు బీజేపీ పార్టీ వేర్పాటువాద రాజకీయాలకు తెరలేపటం సిగ్గుచేటు. ఈ ఘటనతో బీజేపీ రాజ్యాంగంలోని అన్ని పరిధిలు దాటింది. బీజేపీ వాళ్ల దృష్టితో టర్బన్‌ ధరించిన ప్రతి సిక్కు వ్యక్తి.. ‘ఖలిస్థానీ’. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. బీజేపీ వాళ్లు సిక్కు సోదరసోదరీమనులను అవమానపరిచారు. వారి త్యాగాలను కించపరిచారు. తాము బెంగాల్‌ సామాజిక శ్రేయస్సుకు కట్టుబడి ఉంటాం. బెంగాల్‌ సామాజిక సామరస్యాన్ని భంగం కలిగించేవారిపై చట్టబద్దమైన కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు.

ఈ ఘటనపై సదరు పోలీసు ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడారు. ‘నేను టర్బన్‌ ధరించింనందుకు నన్ను ‘ఖలిస్థానీ’ అని బీజేపీ కార్యకర్తలు అన్నారు. నేను వారిపై చర్యలు తీసుకుంటా. తన మతంపై ఎవరూ దాడి చేయడానికి వీలు లేదు. నేను ఇతరుల వారి మతంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు’ అని పేర్కొన్నారు.

చదవండి: Sandeshkhali: బెంగాల్‌ సర్కార్‌పై హైకోర్టు సీరియస్‌

whatsapp channel

మరిన్ని వార్తలు