నాన్న కాదు..నరరూప రాక్షసుడు

31 May, 2021 12:27 IST|Sakshi

రాయ్‌పూర్‌: నాన్న అంటే ఓ ప్రేమ. తండ్రి పిల్లలకు ఓ మంచి మిత్రుడు. చాలామంది తండ్రులు పిల్లల అభివృద్ధి కోసం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని, ఎన్నో త్యాగాలు చేస్తారు.  ఎదిగిన పిల్లలను చూసి గర్వంతో మురిసిపోయే నాన్నలు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఇదంతా ఒక పార్శ్వం. దీనికి మరో పార్శ్వం ఆ తండ్రే వారి పాలిట నరరూప రాక్షసుడిగా మారడం. తాజాగా చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ తండ్రి తన 18 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులు పాల్పడిన ఘటనలో ఆదివారం పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ఉర్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) అమిత్ తివారీ వివరాల ప్రకారం..గత రెండేళ్లుగా తన తండ్రి తనపై అత్యాచారం చేసి హింసింస్తున్నాడని కూతురు ఆరోపించింది. నిందుతుడు ఆదివారం మళ్లీ బాధితురాలిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో ఆమె తన తల్లితో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. దీంతో అతడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 294(అశ్లీల చర్యలు), 323(బాధ కలిగించినందుకు శిక్ష), 376(అత్యాచారానికి శిక్ష), పోక్సో(లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) చట్టం కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు వెల్లడించారు.

(చదవండి: అనుమానంతో ఓ వ్యక్తిపై 10 మంది దాడి..మృతి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు