అమానుషం: నన్నే ఆపుతారా అంటూ...జనాల మీద నుంచి పోనిచ్చిన కారు డ్రైవర్‌

28 Oct, 2022 16:48 IST|Sakshi

ఇటీవల కాలంలో పలువురు వ్యక్తులు చిన్నవాటికే విసుగుపోయి చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడోక వ్యక్తి కూడా చిన్న గొడవకే  ఆగ్రహంతో చాలా దారుణంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఢిల్లీలోని అలీపూర్‌లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే... ఒక వ్యక్తి ఎస్‌యూవీ కారుతో ఒక ఇరుకైన గల్లీ గుండా వెళ్తున్నాడు. అక్కడే తన ముందు ఉన్న ఒక బైకర్‌తో గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే చుట్టుపక్కల వాళ్లు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఐతే కారు డ్రైవర్‌ మాత్రం కోపంతో యాక్సిలరేటర్‌ నొక్కి ఒక్కసారిగా ప్రజలపైకి దూసుకుని పోనిచ్చి... ఇక ఆగకుండా అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయాడు.

దీంతో ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఐతే ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే సదరు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందు సంబంధించిన వీడియో సోషల్‌ మాధ్యమంలో వైరల్‌ అవుతోంది. 

(చదవండి: ఛేజింగ్‌ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు)

మరిన్ని వార్తలు