కూతుళ్లకు వ్యాక్సిన్‌ వేసినందుకు ఆరోగ్య కార్యకర్తలపై దాడి... చంపేస్తానంటూ బెదిరింపులు

3 Aug, 2022 19:58 IST|Sakshi

Girl vaccinated after her mother’s consent: హర్యానాలోని ఒక వ్యక్తి తన కూతుళ్లుకు వ్యాక్సిన్‌ వేసినందుకు పెద్ద హంగామ సృష్టించాడు. వ్యాక్సిన్‌ వేసిన ఆరోగ్యకర్తలను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...హర్యానాలోని నిహల్‌గర్‌ గ్రామంలో ఒక ఆరోగ్యం కేంద్రంలో అంగన్‌వాడి, ఆశా వర్కర్లు పిల్లలకు వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. ఈ మేరకు ఓ ఇద్దరు బాలికలు తమ తల్లి అనుమతితో ఆరోగ్యం కేంద్రం వద్ద యాంటీ మీజిల్స్‌ వ్యాక్సిన్‌లు వేయించుకున్నారు. వాస్తవానికి ఆ వ్యాక్సిన్‌ తట్టు లేదా పొంగు వంటి వ్యాధుల రాకుండా వేసే వ్యాక్సిన్‌.

ఐతే ఇంతలో ఆ బాలికల తండ్రి హరుణ్‌ ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి తన కూతుళ్లకు వ్యాక్సిన్‌ ఎందుకు వేశారంటూ పెద్ద రగడ చేశాడు. అంతేకాదు వ్యాక్సిన్‌లు వేసే అంగన్‌వాడి, ఆశా వర్కరులను దుర్భాషలాడుతూ...చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నిర్మలా యాదవ్‌ అనే ఆరోగ్య కార్యకర్త పోలీసులుకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు హరుణ్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని పేర్కొన్నారు. అతను విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడని, కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

(చదవండి: క్క వెంటే చిట్టితల్లి.. హృదయాన్ని కదిలించిన దృశ్యం)

మరిన్ని వార్తలు