విమానంలో బిత్తిరి చర్య.. బట్టలిప్పి మరీ రచ్చ

8 Apr, 2021 20:20 IST|Sakshi
ఎయిర్‌ఏషియా ఇండియా విమానం (ఫైల్‌ ఫోటో)

ఎయిర్ ఏషియా విమానంలో చోటు చేసుకున్న ఘటన

సదరు ప్రయాణికుడి మీద పోలీసు కేసు నమోదు

న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు చేసే తింగరి పనులకు సంబంధించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి ఎయిర్ ఏషియా విమానంలో చోటు చేసుకుంది. ఇటాలియన్‌ స్మూచ్‌ ఇవ్వనందుకు ఓ ప్రయాణికుడు విమానంలో బట్టలిప్పి మరీ రచ్చ చేశాడు. విమాన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తోన్న ఎయిర్‌ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్‌ క్రూ వద్దకు వెళ్లి లైఫ్‌ జాకెట్‌ ఇవ్వాలంటూ గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత మరి కాసేపటికి క్రూ దగ్గరకి వెళ్లి తనకు ఇటాలియన్‌ స్మూచ్‌ కావాలి అని అడిగాడు. వారు లేదని చెప్పడంతో ఆగ్రహించిన సదరు ప్రయాణికుడు తన ల్యాప్‌టాప్‌ విసిరి కొట్టాడు. 

తరువాత ఒంటి మీద బట్టలు విప్పుకుని.. ఎయిర్‌హోస్టెస్‌ని పిలిచి.. తనకు దుస్తులు వేయాల్సిందిగా కోరాడు. లేదంటే ముద్దిమ్మని అడిగాడు. సదరు ప్యాసింజర్‌ బిత్తిరి చర్యలకు మిగతా ప్రయాణికలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక విమానం ల్యాండ్‌ అవుతుండగా మరోసారి బట్టలిప్పి రచ్చ చేశాడు. సిబ్బంది ఎలాగో కష్టపడి అతడికి దుస్తులు తొడిగి సీట్లో కూర్చొబెట్టాడు. ఆ తర్వాత విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అతడిని అప్పగించారు. విమానంలో తప్పుగా ప్రవర్తించినందుకు గాను అతడి మీద కేసు నమోదు చేశారు. అతడి వింత ప్రవర్తన చూసిన మిగతా ప్రయాణికులు అతడు డ్రగ్స్‌ తీసుకుని ఉంటాడు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. 

చదవండి: బాబోయ్‌.. అసలు ఇంతకాలం నువ్వు ఎలా బతికావ్‌!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు