కరోనా టెస్ట్‌ లేట్‌గా చేస్తున్నారని సిబ్బందిపై దాడి

26 Apr, 2021 12:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కోలారు: కోవిడ్‌ పరీక్ష చేయకుండా జాప్యం చేస్తున్నారని కోపంతో ఓ యువకుడు సిబ్బందిపై దాడికి దిగాడు. వివరాలు..  ఆదివారం ఎస్‌ఎన్‌ఆర్‌ ఆస్పత్రిలో కుమార్‌ (25) అనే యువకుడు కరోనా టెస్టు కోసం వచ్చాడు. టెస్టింగ్‌ ఆలస్యం చేస్తున్నారని  సిబ్బంది భోజనానికి వెళ్లబోతుండగా కుమార్‌ వారిని అడ్డుకుని దుర్భాషలాడుతూ దాడి చేశాడు.

దీంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వచ్చి కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. టెస్టుల ఆలస్యం వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు తెలిపారు.

చదవండి: చనువుగా ఫోటోలు, వీడియో కాల్స్‌.. కట్‌ చేస్తే..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తల్లిని చేశాడు

మరిన్ని వార్తలు