ఉన్మాదం: కరోనా రోగి మృతదేహాన్ని పీక్కుతిన్న వ్యక్తి

5 May, 2021 09:59 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్‌ బారినపడిన వ్యక్తితో సన్నిహితంగా ఉంటే వైరస్‌ సోకే అవకాశం అధికంగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే కోవిడ్‌తో మరణించినవారి దగ్గరికి ఎవరూ వెళ్లటం లేదు. అదీకాక కోవిడ్‌ బారినపడిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా కలవడానికి జంకుతున్నారు. ఇటువంటి సమయంలో ఓ యువడుకు ఏకంగా కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని పీక్కుతిన్నాడు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొన్ని రోజుల కిందట ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫల్టాన్ మున్సిపల్ పరిధిలోని ఓ శ్మశానవాటికలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గత బుధవారం ఉదయం సతారా జిల్లాలోని కోలకి గ్రాయ పంచాయతీ శ్మశాన వాటికలో ఓ మతి స్థిమితం లేని యువకుడు కనిపించాడు.

శ్మశాన వాటికలో తిరుగుతూ సగం కాలిన కరోనా మృతదేహం అవయవాలను తినడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఫల్టాన్​ మున్సిపల్​ అధికారులు అక్కడకు చేరుకునేసరికి సదరు వ్యక్తి పరారయ్యాడు. సాయంత్రం వరకు అధికారులు అతడిని వెతికి పట్టుకున్నారు.

అతని ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌ట్టి మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అతడు హిందీ భాషలో మాట్లాడుతున్నాడని.. పేరు, ఊరు వివరాలు చెప్పడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఆ యువకున్ని మానసిక వైద్యుడి వద్దకు చికిత్స కోసం తరలించామ‌ని తెలిపారు. అదేవిధంగా అతనికి సంబంధించిన మెడిక‌ల్ రిపోర్టులు వచ్చిన అనంతరం ఈ ఘ‌ట‌న‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
చదవండి: తమిళనాడు: ఆక్సిజన్‌ అందక 11 మంది మృతి

మరిన్ని వార్తలు