వైరల్‌ వీడియో: తందూరి కాదు ‘ఉమ్మి’ రోటీ

18 Oct, 2021 12:10 IST|Sakshi

ఘజియాబాద్‌లో చోటు చేసుకున్న సంఘటన

వీడియో వైరల్‌.. నిందితుడి అరెస్ట్‌

లక్నో: సాధారణంగా బయట ఆహారం తీసుకోవాడానికి చాలామంది ఇష్టపడరు. ఎలాంటి పదార్థాలు వాడతారో తెలియదు.. వంట చేసేవాళ్లు.. అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంటాయో లేదో తెలియదు. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ భయం మరింత పెరిగింది. పైగా అప్పుడప్పుడు కొందరు నికృష్టపు పనులు చేస్తూ ఉంటారు. గతంలో పానీపూరీ బండి వ్యక్తి ఎలాంటి నీచమైన పని చేశాడో చూశాం కదా. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తందూరి రోటీలు చేస్తున్న వ్యక్తి వాటి మీద ఉమ్మి.. ఆ తర్వాత కాలుస్తున్నాడు. ఆ వివరాలు..

ఈ సంఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ధాబాలో ఓ వ్యక్తి తందూరి రోటీలు తయారు చేస్తుంటాడు. రోటీ తయారు చేసేటప్పుడు సాధారణంగా నూనె, నీరు వాడతారు. కానీ ఇతగాడు మాత్రం వాటి మీద ఉమ్మి.. ఆ తర్వాత రోటీ చేసి.. వాటిని కాలుస్తాడు. 
(చదవండి: వైరల్‌: అరెరే.. పాక్కుంటూ వెళ్లినా, అడ్డంగా బుక్కయ్యావ్‌ కదా!)

ఇలా ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ.. కొన్ని రోజుల క్రితం ధాబాకు వచ్చిన ఓ వ్యక్తి.. సదరు వ్యక్తి చేస్తున్న దారుణాన్ని వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దాంతో ఇది కాస్త వైరల్‌గా మారడమే కాక సదరు ధాబా మీద కేసు నమోదయ్యింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 
చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్‌..?

మరిన్ని వార్తలు