గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే..

4 Mar, 2021 11:10 IST|Sakshi
పుట్టిన రోజు వేడుకల్లో చేతక్‌

పాట్నా :  ఓ గుర్రం పుట్టిన రోజు వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించాడు దాని యజమాని. రుచికరమైన పేద్ద కేకుతో.. నోరూరించే విందు భోజనంతో లక్షలు ఖర్చుపెట్టి మరీ చేశాడు. ఈ సంఘటన బిహార్లో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సహర్షా జిల్లాలోని పాంచ్‌వతిచౌక్‌కు చెందిన రజ్‌నీష్‌ కుమార్‌ అలియాస్‌ గోలు యాదవ్‌కు చేతక్‌ అనే తెల్ల గుర్రం ఉంది. దాన్ని చిన్నప్పటినుంచి కన్న బిడ్డలాగా పెంచుతున్నాడు. ఇంట్లో వాళ్లు దాన్ని ఇంటి సభ్యుడిలాగే చూసేవారు. అదో జంతువు అని అంటే ఒప్పుకునేవారు కాదు. తన పుట్టినరోజు వేడుకలకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వని గోలు యాదవ్‌.. చేతక్‌ పుట్టిన రోజును ఓ పండుగలా జరిపేవాడు.

కేక్‌ కట్‌ చేస్తున్న గోలు యాదవ్‌

ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం లాగే పెద్ద ఎత్తున జరిపాడు. చేతక్‌కు స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగించాడు. తనే దగ్గరుండి ఓ పెద్ద కేకు కట్‌ చేశాడు. ఊరందరికీ వెజ్‌, నాన్‌ వెజ్‌ భోజనాలు పెట్టించాడు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో పెద్ద ఎత్తున జనాలు పాల్గొన్నారు.  ప్రస్తుతం చేతక్‌ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై గోలు యాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘ నేను నా బిడ్డలాగా చేతక్‌ని పెంచాను. నా పిల్లలకంటే ఎక్కువ ప్రేమ దానికి పంచాను’’ అని అన్నాడు.

దవండి : వైరల్‌ : నీ టైం బాగుంది ఇంపాల

మరిన్ని వార్తలు