సినిమాలోనూ ఇలాంటి ట్విస్ట్‌ ఉండదేమో!.. చనిపోయి మళ్లీ బతికాడు.. వీడియో వైరల్‌

22 Nov, 2021 11:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ బతకడం లాంటివి సినిమాలో చూసుంటాం. కానీ ఈ తరహా ఘటనే యూపీలోని మోరదాబాద్‌లో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి చనిపోయాడనుకుని సుమారు 7 గంటలపాటు మార్చురీ ఉంచిన్నప్పటికీ సజీవంగా బతికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే..  మొరాదాబాద్ పౌరసరఫరాల సంస్థలో ఎలక్ట్రీషియన్ శ్రీకేష్ కుమార్ (40) పని చేస్తున్నాడు.

గురువారం రాత్రి వేగంగా వస్తున్న బైక్‌ ఢీకొనడంతో శ్రీకేష్ కుమార్‌ను జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రిలోని వైద్యులు అతను చనిపోయినట్లు ధ్రువీకరించి అతన్ని మార్చురీలో ఫ్రీజర్‌లో ఉంచి పోస్ట్‌మార్టం పరీక్ష పెండింగ్‌లో ఉంచారు. పంచనామ పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడానికి పోలీసులు వచ్చారు. ఆ సమయంలో శ్రీకేశ్‌ కుమార్‌ మృతదేహంలో కదలికలను అతని వదిన గుర్తించారు. ప్రస్తుతం అతని వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  వెంటనే డాక్టర్లు శ్రీకేశ్‌కు చికిత్స అందించగా బతికి బయటపడ్డాడు. 

చదవండి: Viral Video: పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వదిన.. అందరి చూపు ఆమె వైపే

మరిన్ని వార్తలు