కూతురి పెళ్లి డబ్బు.. పేదలకు రూ.5 వేల చొప్పున దానం

16 May, 2021 11:26 IST|Sakshi

సాక్షి, మైసూరు: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించాయి. లాక్‌డౌన్‌ కారణంగా వివాహా కార్యక్రమాలు పరిమిత సంఖ్యలో జరుగుతున్నాయి. అదేవిధంగా పూర్తి లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో పెళ్లిళ్లు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా తన  కూతురి పెళ్లిని నిరాడంబరంగా నిర్వహించి, ఆ పెళ్లికయ్యే ఖర్చు మొత్తాన్ని పేద కుటుంబాలకు పంచిపెట్టారో మహానుభావుడు.

మైసూర్‌లోని తిలక్‌ నగరకు చెందిన హరీశ్‌ అనే వ్యక్తి కుమార్తె వివాహం మే 12,13వ తేదీల్లో పెట్టుకున్నారు. కానీ, రాష్ట్రంలో  లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దీంతో ఇంట్లోనే తన కుమార్తె పెళ్లిని నిరాడంబరంగా చేశారు. ఇక పెళ్లికని దాచుకున్న రూ.2లక్షల సొమ్మును 40పేద కుటుంబాలకు రూ.5వేల చొప్పున పంచిపెట్టారు. ఆయన చేసిన ఈ మంచి పనికి స్థానికులు ప్రశంసిస్తున్నారు.
చదవండి: వైరల్‌: క్వారంటైన్‌లో ఎమ్మెల్యే చిందులు

మరిన్ని వార్తలు