తప్పతాగి.. రైల్వే ట్రాక్‌పై కారు నడిపి..

22 Jul, 2023 16:21 IST|Sakshi

తిరువనంతపురం: పీకలదాక తాగి రైల్వే ట్రాక్‌పై కారును నడిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని జయప్రకాశ్‌గా గుర్తించారు. కేరళ, కన్నూర్‌ సమీపంలోని అంచరకండిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా చొవ్వ రైల్వే క్రాస్ దగ్గర ట్రాక్‌పై ఉన్న నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. 

జయప్రకాశ్‌ మద్యం మత్తులో ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్‌పైకి కారును పోనిచ్చాడు. మత్తులో ఉన్న కారణంగా ట్రాక్‌ను నిందితుడు రోడ్డుగా భ్రమపడినట్లు తెలుస్తోంది. దాదాపు 15 మీటర్ల దూరం పోగానే ట్రాక్‌పై కారు ఇరుక్కుని నిల్చిపోయింది. ఈ విషయాన్ని గమనించిన గేట్ కీపర్ పోలీసులకు సమాచారం అందించాడు. 

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో కారును ట్రాక్‌పై నుంచి బయటకు తీశారు. జయప్రకాశ్‌ను అరెస్టు చేశారు. ఆ సయమంలో ఎలాంటి రైలు రానుందున ముప్పు తప్పిందని తెలిపారు.

ఇదీ చదవండి: Where Snakes Given As Dowry: వామ్మో..! అల్లుళ్లకు కట్నంగా 21 పాములు..

మరిన్ని వార్తలు