మద్యం మత్తులో తాగుబోతు చేసిన పని... షాక్‌లో పోలీసులు!

15 Feb, 2022 17:16 IST|Sakshi

Man Called The Emergency Helpline Of Haryana Police: ప్రతి రాష్ట్రానికి కొన్ని ఎమర్జెన్సీ నెంబర్లు ఉంటాయి. ప్రజలకు అత్యవసర సమయాల్లో సహాయ సహకారాలు అందించే నిమిత్తం అధికారులు ఈ ఫోన్‌ నెంబర్లను కేటాయిస్తారు. అయితే కొందరు వాటిని దుర్వినియోగం పరిచి విలువైన సమయాన్ని వృద్ధా చేస్తుంటారు. అచ్చం అలాంటి సంఘటనే హర్యానాలో చోటు చేసుకుంది.

అసలు విషయంలోకెళ్తే...హర్యానాలో అ‍్యతవసర హెల్పలైన్‌ నెంబర్‌ 112 ఒకటి ఉంది. ప్రజలు ఆపదల్లో ఉన్నప్పుడు లేదా ఏదైన ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఈ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ కాల్‌ చేస్తే పోలీసులు వచ్చి తక్షణ సాయం అందిస్తారు. అయితే ఈ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కి ఒక తాగుబాతు కాల్‌ చేసి సహాయం అడుగుతాడు. దీంతో పోలీసులు హుటాహుటిన ఆ తాగుబోతు ఉన్న చోటుకి తరలివస్తారు. అయితే అక్కడ ఆ తాగుబోతు పోలీసు కారు వచ్చిందా అని అక్కడకి వచ్చిన పోలీసులను అడిగాడు.

దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురై ఎందుకు ఈ ఎమర్జెన్సీ నెంబర్‌ కాల్‌ చేసావని ప్రశ్నించారు. ఆ వ్యక్తి సాయంత్రం ఐదు గంటలకు రైళ్లు, కార్లు తిరగకపోవడంతో అసలు పోలీసులు పనిచేస్తున్నారో లేదో అనే సందేహం వచ్చిందని అందువల్ల తెలుసుకునేందుకు కాల్‌ చేశానని చెబుతాడు. దీంతో పోలీసులకు ఒక్కసారిగా మతిపోతుంది. సదరు వ్యక్తి రాయ్‌పురానిలోని తప్రియా గ్రామానికి చెందిన 42 ఏళ్ల నరేష్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఈ ఎమర్జెన్సీ నెంబర్‌కు ఎందుకు కాల్‌ చేయాలో కూడా వివరించడమే కాక ఎందుకు తాగుతున్నావని నరేష్‌ని ప్రశ్నించారు కూడా. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

(చదవండి: మోడల్‌గా మారిన 60 ఏళ్ల కూలీ!)

మరిన్ని వార్తలు