ఢిల్లీ రెస్టారెంట్‌‌లో ఘటన.. పోలీసులకు ఫిర్యాదు

3 Aug, 2020 15:09 IST|Sakshi

న్యూఢిల్లీ: అసలే ఇది కరోనా కాలం. హోటళ్లలో భోజనం చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. అనవరసరంగా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు అని శుభ్రంగా ఇంట్లోనే తింటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ హోటల్‌లో టిఫిన్ చేసిన ఓ వ్యక్తికి భయంకరమైన అనుభవం ఎదరయింది. దోశ తింటుండగా సాంబారులో బల్లి ప్రత్యక్షమైంది. కన్నాట్ ప్లేస్‌లో దక్షిణాది వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. వివరాలు.. కొందరు వ్యక్తులు టిఫిన్ చేసేందుకు ఢిల్లీలోని పాష్‌​ ఏరియా.. లగ్జరీ హోటళ్లకు ప్రసిద్ధి చెందిన కన్నాట్‌కు వెళ్లారు. అక్కడ దక్షిణాది వంటకాలకు ఫేమస్‌ చెందిన ఓ రెస్టారెంట్‌కు వెళ్లి సాంబార్‌, దోశ ఆర్డర్‌ ఇచ్చారు. టిఫిన్‌ వచ్చాక.. తినడం ప్రారంభించారు. ఇంతలో ఓ వ్యక్తికి సాంబారులో బల్లి కనిపిచింది. ఐతే సగం బల్లి మాత్రమే ఉండటంతో వణికిపోయాడు. మిగతా సగం బల్లి ఎక్కడుంది.. వేరే వారికి వెళ్లిపోయిందా.. లేదంటే కొంపదీసి తనే తిన్నానా ఏంటి అని భయడిపోయాడు. వెంటనే హోటల్ మేనేజర్‌ని పిలిచి నిలదీశాడు. అందరిపై విరుచుకుపడి నానా రచ్చ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (వంటింటి వైద్యంతో కరోనా ‘ఆవిరి’)

'నా నోటి నుంచి ఈ బల్లిని తీశాను. సగమే ఉంది. మిగతా సగం నేనే తిన్నానా? లేదంటే హోటల్ కిచెన్‌లోని సాంబారు గిన్నెలోనే ఉండిపోయిందా? లేదంటే ఇతరులకు వడ్డించారా?' అని ఆ కస్టమర్ వాపోయాడు. అనంతరం రెస్టారెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిచెన్‌తో పాటు హోటల్‌లో ఉన్న సీసీ ఫుటేజీ ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే దోశ తయారీకి వాడే పదార్థాల వివరాలను అందజేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు