నిశ్చితార్థమైన యువతికి బలవంతంగా తాళి కట్టి..

28 Jan, 2021 10:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు: ఒకరితో నిర్చిత్తార్థమైన యువతిని మరో వ్యక్తి తీసుకెళ్లి తాళి కట్టాడు. ఈ ఘటన హాసన జిల్లా సకలేశపుర తాలూకాలో ఆలస్యంగా వెలుగు చూసింది. కుశాలనగరకు చెందిన యువతికి ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈనెల 25న వివాహం జరిపించాలని నిర్ణయించారు. అయితే ఆ యువతిని తాను ప్రేమిస్తున్నానంటూ సతీష్‌ అనేయువకుడు ఈనెల 24న ఆ యువతి ఇంటిలోకి చొరబడి అక్కడే తాళి కట్టి ఆమెను వెంట తీసుకెళ్లాడు. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టి సతీష్‌ను అరెస్ట్‌ చేశారు. యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.   

మరిన్ని వార్తలు