విమానంలో మహిళలపై వేధింపులు.. అభ్యంతకర ఫొటోలు తీసి..

18 Aug, 2023 21:25 IST|Sakshi

ఢిల్లీ: ఢిల్లీ-ముంబయి విమానంలో ఓ ప్రయాణికుడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. విమాన సిబ్బందితో పాటు తోటి మహిళా ప్యాసింజర్ల అభ్యంతకర ఫొటోలను తీశాడు. బాధితుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. సదరు ప్రయాణికునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

SG 157 విమానం ఆగష్టు 2న ఢిల్లీ నుంచి ముంబయి బయలు దేరింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు సిబ్బంది, తోటి మహిళా ప్రయాణికుల అభ్యంతకర ఫొటోలను తీశాడు. ఇది గమనించిన సిబ్బంది అతన్ని పట్టుకుని ఫోన్‌లో నుంచి ఫొటోలను డిలీట్ చేయించారు. క్షమాపణలు కోరుతూ లేఖను రాయించారు. అయినప్పటికీ ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. నిందితున్ని శిక్షించాలని పోలీసులను కోరారు.

'విమానాల్లో లైంగిక వేధింపులు సహించరానివి. నిందితునిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. పౌరవిమానయాన సంస్థ ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదు.' అని ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్ అన్నారు.  ఇన్ని రోజుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని మహిళా కమిషన్.. ఢిల్లీ పోలీసులకు , విమానయాన సంస్థకు నోటీసులు జారీ చేసింది. 

ఇదీ చదవండి: కోటా హాస్టల్స్‌లో ఆత్మహత్యల కట్టడికి కొత్త ఆలోచన

మరిన్ని వార్తలు