వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్‌

8 Oct, 2020 16:05 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ప్రధాని నరేంద్ర మోదీల శిరచ్ఛేదనం చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. అంతేకాక జనాలు అభినందనలు తెలుపుతూ.. చప్పట్లు కొడుతూ అతడి వ్యాఖ్యలను స్వాగతించారు. వివరాలు.. రాష్ట్రీయ్‌ లోక్‌దళ్‌ నాయకుడు జయంత్‌ చౌదరి హథ్రాస్‌ బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి ప్రయత్నించడంతో పోలీసులు అతడిపై లాఠీ చార్జీ చేశారు. ఇందుకు వ్యతిరేకంగా మీరట్‌, ముజఫర్‌ నగర్‌, బాగ్‌పట్‌, బులంద్‌షహర్‌ అలీగఢ్‌, బిజ్నోర్‌ జిల్లాల్లో భారీ నిరసనలు జరిగాయి. అలానే ముజఫర్‌ నగర్‌లో మహాపంచాయత్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సభను ఉద్దేశించి ప్రసంగించాడు. ‘మనందరం ఏకం కావాలి. పీఎం మోదీ, సీఎం యోగిల తలలు నరికి మీ పాదాల చెంత పడేయాలనుకుంటున్నాను’ అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాలు అతడి వ్యాఖ్యలను స్వాగతిస్తూ చప్పట్లతో అభినందించారు. దాంతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.(చదవండి: భయంగా ఉంది.. వెళ్లిపోతాం!)

హథ్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి వెళుతున్న తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జీ చేసినందుకు నిరసనగా రాష్ట్రీయ లోక్‌దళ్ కార్యకర్తలు మధుర సమీపంలోని నౌహిల్ బజ్నా-అలీఘర్ రహదారిపై ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మలను కూడా ఆర్‌ఎల్‌డి కార్మికులు తగలబెట్టారు.

మరిన్ని వార్తలు