ప్రియుడి చేతివాటం.. ప్రియురాలికి కానుకగా ఇవ్వడానికి దొంగతనం

30 Jul, 2022 16:24 IST|Sakshi
మునాఫ్,  షాపులో సీసీ కెమెరాల ఫుటేజీలో   

సాక్షి, బెంగళూరు: ప్రియురాలి కోసం లక్షలాది రూపాయల విలువచేసే మొబైల్‌ఫోన్లను దొంగిలించిన వ్యక్తిని శుక్రవారం జేపీ నగర పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతని వద్ద నుంచి రూ.5 లక్షల విలువచేసే 6 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అబ్దుల్‌ మునాఫ్‌ ఈ నెల 22వ తేదీ సాయంత్రం జేపీ నగర క్రోమా మొబైల్‌ స్టోర్‌లో కొనుగోలు నెపంతో వెళ్లాడు. అక్కడి టాయ్‌లెట్‌కు వెళ్లి షాపు మూసేవరకు అందులో దాక్కున్నాడు. సిబ్బంది షాపును మూసి వెళ్లగానే ఖరీదైన మొబైల్స్‌ను జేబులో వేసుకున్నాడు.

మరుసటి ఉదయం స్టోర్‌ తెరవగానే మరో డోర్‌ నుంచి జారుకున్నాడు. ఫోన్లు మిస్సయినట్లు గమనించిన సిబ్బంది సీసీ కెమెరాలను చూడగా దొంగ బండారం బయటపడింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అబ్దుల్‌ మునాఫ్‌ను అరెస్ట్‌చేసి ఇతడి వద్ద నుంచి  6 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనికి ఇదే మొదటి చోరీ అని, ప్రియురాలికి కానుకగా ఇవ్వడానికి దొంగతనం చేశాడని గుర్తించారు.
చదవండి: విషాదం.. ఎలుకల కోసం విషం పూసిన టమాట తిని

మరిన్ని వార్తలు