మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..

19 Oct, 2022 14:36 IST|Sakshi

ఇప్పటి వరకు ఎన్నో వైరల్‌​ వీడియోలు చూశాం. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియో అందరీ హృదయాలను దోచేవిధంగానూ, కదిలించేలా ఉంటుంది. రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవించే ఒక వృద్ధురాలు కలలో కూడా ఊహించి ఉండి ఉండదు. తన జీవితంలో ఇలాంటి మంచి రోజు ఒకటి ఉంటుందని, చింత లేకుండా బతకుతాను అని అనుకుని ఉండకపోవచ్చు కదా. ఆ యువకుడు ఒక్కరోజులో ఆమె జీవితాన్ని మొత్తం మార్చేశాడు. 

వివరాల్లోకెళ్తే...75 ఏళ్ల వృద్ధురాలు రోడ్డుపై చెత్త కాగితాలు అమ్ముకుంటూ జీవిస్తుంటుంది. ఒక యువకుడు వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. ఆమె చెత్తకాగితాలు అమ్ముకుంటూ బతుకుతుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆ యువకుడు ఆమెను తీసుకెళ్లి షాపింగ్‌ చేయించి ..కూరగాయాలు, వేయింగ్‌ మిషన్‌, తోపుడు బండి వంటి అన్ని వస్తువులు కొని కూరగాయాలు అమ్ముకుంటూ బతకమని చెబుతాడు.

అంతేగాదు ఆమెకు రోజు బతకడానికి కావల్సిన కనీస అవసరాలన్నింటిని సమకూరుస్తాడు. దీంతో సదరు వృద్ధురాలి సంబరపడిపోతూ ఆ యువకుడిని ఆనందంగా ఆశీర్వదిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవినాశ్‌ శర్మ పోస్ట్‌ చేశారు. ఆ వృద్ధురాలికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి తరుణ్‌ మిశ్రా అనే ఇన్‌స్ట్రాగ్రామర్‌ అని చెప్పారు.  అతను తన అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన వీడియో నచ్చడంతో షేర్‌ చేసినట్లు తెలిపారు. అంతేగాదు నెటిజన్లు ఆ వృద్ధురాలికి చేసిన సాయానికి సదరు యువకుడిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.

A post shared by TARUN MISHRA (@tarun.mishra17)

(చదవండి: చికెన్‌ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్‌ని తగలెట్టేశాడు)

మరిన్ని వార్తలు