నీవే నా దేవత.. భార్యకు విగ్రహం

28 Nov, 2021 07:54 IST|Sakshi
భార్య విగ్రహానికి పూజలు చేస్తున్న భర్త శివచౌగుల్‌  

యశవంతపుర: బెళగావిలోని గంగ్‌వాడికి చెందిన మాజీ కార్పొరేటర్‌ శివచౌగుల్‌ భార్య మైనాబాయి కొంతకాలం కిందట న్యుమోనియా మృతి చెందారు. ముప్పైఏళ్ల పాటు కష్టసుఖాలను పంచుకున్న భార్య దూరం కావడం ఆయన తట్టుకోలేకపోయారు. దీంతో భార్య నిలువెత్తు రూపాన్ని తయారు చేయించి ఇంట్లో నెలకొల్పారు. ఆయన భార్య విగ్రహానికి రోజు పూజలు చేస్తారు. ఆమె ధరించిన బంగారు తాళిబొట్టుతో పాటు గాజులను కలిపి 20 తులాల బంగారాన్ని ప్రతిమపైనే ఉంచారు. ప్రత్యేక బీరువాలో 4 వందల చీరలను పెట్టారు.
చదవండి: యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్‌ స్తంభానికి కట్టేసి..  

మరిన్ని వార్తలు