మేమూ నీతో పాటే అంటూ .. చనిపోయిన భర్త, పిల్లలు

24 Oct, 2021 12:15 IST|Sakshi

బెలగావి: సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తే హృదయం ద్రవించిపోతుంది.  మనకు ఎంతో ఇష్టమైన వాళ్లు చనిపోతే ఆ బాధను భరించడం కష్టం. కానీ కొంతమంది ఆ బాధను మర్చిపోలేక ఆవేదనతో తప్పుడు నిర్ణయం తీసుకుని జీవితాన్ని ముగించేస్తారు. అచ్చం అలాంటి సంఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది.

(చదవండి: అమేజింగ్‌ ఆర్ట్‌ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!)

వివరాల్లోకెళ్లితే.... ఒక ఎక్స్‌ ఆర్మీ మ్యాన్‌ తన భార్య మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై తన నలుగురి పిల్లలకు విషం ఇచ్చి, తాను చనిపోయాడు. ఈ ఘటన సంకేశ్వరంలోని బోర్గల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు చనిపోయిన వ్యక్తి  గోపాల్ హదీమణిగా  పిల్లలు సౌమ్య, శ్వేత, సాక్షి, సృజన్‌లుగా గుర్తించారు.

అయితే అతని భార్య జయ జూలై 6న కోవిడ్‌ కారణంగా బ్లాక్‌ ఫంగస్‌తో  చనిపోవడంతో గోపాల్‌ ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు సందేహం వ్యకం చేస్తున్నారు. అంతేకాదు గోపాల్‌ భార్య మరణంతో చాలా ఆవేదన చెందాడని, పైగా అప్పటి నుంచి పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాడంటూ బాధితుడి బంధువులు చెబుతున్నారని పోలీసులు అన్నారు. ఈ మేరకు ఇరుగుపొరుగు వచ్చి తలుపులు కొట్టిన పలకక పోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలుకొట్టి చూస్తే గోపాల్‌, అతని పిల్లలు చనిపోయి ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: తింగరోడు.. లైవ్‌ టెలికాస్టింగ్‌లో ఫోన్‌ చోరీ! కట్‌ చేస్తే..)

మరిన్ని వార్తలు