పెళ్లైన రెండోరోజే పారిపోయి.. రైలులో ప్రేమించిన వాడితో పెళ్లి!

12 Jun, 2021 09:15 IST|Sakshi

బెంగళూరు/పట్నా: ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు.. కారణం అప్పటికే ‍కొన్ని సంవత్సరాలుగా వేరే అబ్బాయితో ప్రేమలో ఉంది. అయినా సరే ఆ తల్లిదండ్రులు అమ్మాయి ప్రేమను ఒ‍ప్పుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ఆమె తాను ప్రేమించిన యువకుడిని తప్ప మరొకరిని భర్తగా ఊహించుకోలేకపోయింది. అంతే పెళ్లైన రెండోరోజే కట్టుకున్న భర్తను విడిచిపెట్టి వచ్చేసింది. ఆ తర్వాత ఆ యువతి తాను ప్రేమించిన యువకుడిని రైల్వే స్టేషన్‌లో కలిసి బెంగళూరు వెళ్తున్న రైలు ఎ‍క్కింది. కదులుతున్న రైళ్లోనే ఆ యువకుడు తాను ప్రేమించిన అమ్మాయికి మూడు ముళ్లు వేశాడు. అలా ఆ ప్రేమజంట ఒక్కటయ్యింది.

వివరాలు.. బిహార్‌కు చెందిన అను కుమారి, అషుకుమార్‌లు కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఇది నచ్చని అనుకుమారి తల్లిదండ్రులు ఆమెకు రెండు నెలల క్రితం కిరణ్‌పూర్‌ గ్రామానికి చెందిన యువకుడితో బలవంతంగా పెళ్లి జరిపించారు. కానీ అను ఆ యువకుడిని భర్తగా ఒప్పుకోలేక పెళ్లైన రెండోరోజే అత్తవారింటి నుంచి పారిపోయివచ్చింది.

అనంతరం అషు కుమార్‌ను సుల్తాన్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌లో కలిసింది. వారిద్దరు కలిసి బెంగళూరు వెళ్తున్న రైలు ఎక్కారు. నీకోసం .. తాను కట్టుకున్న భర్తను వదిలేసి వచ్చానని.. మనిద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అను అషుకుమార్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో చేసేదేం లేక కదులుతున్న రైలులోనే ఆమెకు నుదుట సింధూరం దిద్దాడు. ఇది జరిగి రెండు నెలల కావొస్తున్న తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా వెలుగుచూడడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 

చదవండి: పాపం.. ఆ కోడలి సాహసం వృథా!​
భారత్‌లో 121 ఏళ్ల తర్వాత ఇది రెండోసారి..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు