సివిల్స్‌ కోచింగ్‌కు వెళ్లి.. యువకునితో వివాహేతర సంబంధం.. అందుకే..

18 Aug, 2022 15:15 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: భార్యను సినిమాశైలిలో హత్య చేసిన భర్త బండారం బయటపడడంతో కటకటాల పాలయ్యాడు. మడివాళ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ అని ఫిర్యాదు చేసిన భర్త పృధ్వీరాజ్‌ (48) పై అనుమానంతో పోలీసులు అదుపులోకి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డీసీపీ సీకే.బాబా కేసు వివరాలను వెల్లడించారు. మడివాళలో గత 13 ఏళ్లుగా ఎలక్ట్రానిక్ప్‌ అప్లయన్స్‌ దుకాణం నిర్వహిస్తున్న బిహార్‌కు చెందిన పృధ్వీరాజ్‌, 8 నెలల కిందట జ్యోతికుమారి (38) అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

ఆమెది కూడా బిహారే. గత కొద్దిరోజులనుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య విద్యావంతురాలు కాగా ఆమె సివిల్స్‌కు ప్రిపేరవుతోంది. ఒక యువకునితో తరచూ ఫోన్లో మాట్లాడేది. దీంతో భర్త ప్రశ్నించడంతో గొడవలు జరిగేవి. చివరకు ఆమెను హత్యచేయాలని పృధ్వీరాజ్‌ పథకం రూపొందించాడు.


భర్త పృధ్విరాజ్‌  భార్య జ్యోతి (ఫైల్‌)

ఉడుపిలో తొలి యత్నం విఫలం  
ఇద్దరి సెల్‌ఫోన్లు ఇంట్లో పెట్టి ఈ నెల 2న భార్యను ఉడుపి మల్పె బీచ్‌కు తీసుకెళ్లడానికి జూమ్‌ కారును బాడుగకు తీసుకున్నాడు. స్నేహితుడు సమీర్‌కుమార్‌ను కూడా తీసుకెళ్లాడు. బీచ్‌లో భార్యను ముంచేసి సహజ మరణంగా నమ్మించాలన్నది భర్త కుట్ర. కానీ సముద్రం లోతులోకి దిగలేక ప్లాన్‌ ఫలించలేదు. తరువాత సకలేశపురకు తీసుకెళ్లి కారులోనే ఆమెను చున్నీతో గొంతుబిగించి ప్రాణాలు తీసి అక్కడే పొదల్లో పడేసి ఇంటికి చేరుకున్నాడు పృధ్వీరాజ్, అతని మిత్రుడు.  
చదవండి: (మహిళపై అత్యాచారం.. బీజేపీ నేతపై కేసు నమోదు చేయాలని కోర్టు సీరియస్‌) 

మిస్సింగ్‌ అని ఫిర్యాదు  
5వ తేదీన మడివాళ పోలీస్‌స్టేషన్‌లో భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె సెల్‌ఫోన్‌ ఇంట్లోనే  ఉండటాన్ని తెలుసుకుని అనుమానంతో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. పోలీసులు చివరకు  అనుమానం వచ్చి భర్తను తమదైన శైలిలో విచారించగా ఒప్పుకున్నాడు.

భార్య తనను తీవ్ర వేధింపులకు గురిచేసిందని చెప్పాడు. రెండుసార్లు సివిల్స్‌ పరీక్షలు రాయడానికి, శిక్షణ సమయంలో ఢిల్లీకి వెళ్లిన సమయంలో అక్కడ ఒక యువకునితో సంబంధం పెట్టుకుందని, దీంతో విరక్తి చెంది హత్యచేశానని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న అతని మిత్రుని కోసం గాలింపు జరుగుతోంది.  

మరిన్ని వార్తలు