ఉద్యోగం నుంచి తీసేశారని..యజమానిపై కాల్పులు జరిపిన మాజీ ఉద్యోగి

5 Jan, 2023 12:43 IST|Sakshi

ఒక ప్రైవేటు కంపెనీ మాజీ ఉద్యోగి తనను ఉద్యోగం నుంచి తొలగించారని తన యజమానిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...అనూప్‌ సింగ్‌ అనే వ్యక్తి గేట్రర్‌ నోయిడా సెక్టార్‌2లో ఎన్‌సీబీ బీపీఓలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఐతే ఆఫీస్‌లో అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో కంపెనీ సర్కిల్ హెడ్‌ సద్రూల్‌ ఇస్లాం అనూప్‌ని ఆరు నెలలక్రితం ఉద్యోగం నుంచి తొలగించాడు.

ఐతే గత నెల అనూప్‌ మేనేజర్‌ సద్రూల్‌ వద్దకు వచ్చి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అందుకు సద్రూల్‌ అంగీకరించ లేదు. దీంతో అనూప్‌ మళ్లీ బుధవారం సాయంత్రం సద్రూల్‌ వద్దకు వచ్చి ఈ విషయమై అడుగగా...ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. అనంతరం అనూప్‌ దేశీయ తుపాకీతో మేనేజర్‌ ఛాతిపై తీవ్రంగా కాల్పలు జరిపి ..పరారయ్యాడు. దీంతో సదరు మేనేజర్‌ సద్రూల్‌ని హుటాహుటినా కైలాష్‌ ఆస్పత్రికి తరలించారు. ఐతే అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అశుతోష్‌ ద్వివేది కేసు నమోదు చేసి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. 

(చదవండి: ఇడియట్స్‌ అని తిడుతూ..కాంట్రాక్టర్‌ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే)


 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు